తెలంగాణ జాగృతికి కొత్త సారథి.. మాధవికి బాధ్యతలు అప్పగించిన కవిత
తెలంగాణ జాగృతికి కొత్త సారథి.. మాధవికి బాధ్యతలు అప్పగించిన కవిత
telangana


హైదరాబాద్, 27 జూలై (హి.స.)

తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా సంస్థను నడిపించిన కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలను మారిపల్లి మాధవికి అప్పగించారు. సంస్థ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయమని చెబుతున్న నాయకత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, సాంస్కృతిక పరిరక్షణ లక్ష్యాలతో ముందుకు సాగుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మారిపల్లి మాధవిని నియమిస్తూ కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త నాయకత్వంలో జాగృతి మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణే జాగృతి ప్రధాన లక్ష్యమని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో 2006లో ఈ సంస్థను స్థాపించినట్లు గుర్తు చేశారు. ఉద్యమానికి సాంస్కృతిక బలం చేకూర్చడంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ప్రత్యేకతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు సంస్థ నిరంతరం కృషి చేసిందని చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకూ ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande