
ఒంగోలు, 29 జూలై (హి.స.)
, తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతులకు కొంత మేర ఊరట కలిగించేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల రైతుల వద్ద నిల్వ ఉన్న లోగ్రేడ్ పొగాకు పంటకు సుమారు రూ.188కోట్లు బోనస్గా దక్కనుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే పొగాకు మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొన్న విష యం విదితమే. గతంలో ఎన్నడూలేని విధంగా సగానికిపైగా బేళ్లు నిత్యం నోబిడ్లు కావడంతోపాటు రోజురోజుకూ ధరలు తగ్గిపోతూ అసలు కొనుగోళ్లు జరగవేమో అన్నంత ఆందోళ నకు రైతులు గురయ్యారు. ఆ పరిస్థితిపై ఒకవైపు ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతుసంఘాల ఆందోళనలు, మరోవైపు వేలం కేంద్ర రైతు కమిటీ ప్రతినిధుల వినతులతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కదిలారు. ప్రధానంగా మంత్రులు డాక్టర్ డీఎస్బీవీ స్వామి గొట్టిపాటి రవికుమార్ చొరవ చూపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు సత్వరం స్పందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ