
సీతానగరం, 29 జూలై (హి.స.)
: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. రాష్ట్రంలో చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపుతో రైతులు తీవ్రంగా నష్ట పోతుండటంతో వాటి కట్టడికి రెండు కుంకీ ఏనుగులను ఇక్కడికి తరలించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జగదీశ్వరి, జయకృష్ణ, కలెక్టర్ ప్రభాకర రెడ్డి, జేసి వైశాలి, ఆర్డీవో మాధురి, డీఎఫ్వో ప్రసూన పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ