
నిడదవోలు, 29 జూలై (హి.స.)
: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ( పీఎంఎఫ్బీవై ) పథకం రైతు కుటుంబాలకు భరోసా అని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలని కోరుతూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వెంటనే పంట బీమా చేయించుకోవాలన్నారు
వరి బీమా మొత్తం ఎకరానికి రూ.40,000లు కాగా, రైతు ప్రీమియం ఎకరానికి రూ.570ను వచ్చే నెల 15 వరకు, అరటికి ఎకరాకు బీమా మొత్తం రూ.60,000లు కాగా రైతు ప్రీమియం రూ.3,000లు ఈనెల 30లోగా చెల్లించాలన్నారు. మినుము పంటకు ఎకరాకు బీమా మొత్తం రూ.20,000లు కాగా రైతు ప్రీమియం రూ.300లు ఈ నెల 30లోగా చెల్లించాలని సూచించారు. నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న రైతులు, కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ