
ఇచ్ఛాపురం29 జూలై (హి.స.)
: అక్రమంగా గంజాయిను తరలిస్తున్న ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నుంచి గుజరాత్లోని సూరత్కు గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి బస్సులో ఇచ్చాపురం వచ్చి, ఇక్కడ నుంచి రైలు మార్గంలో గుజరాత్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వెళ్తుండగా నిందితులు పట్టుబడ్డారని సీఐ చిన్నంనాయుడు తెలిపారు. పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ