పోలీసు అధికారి వేషంతో మోసం
పోలీసు అధికారి వేషంతో మోసం
fraud


ఒంగోలు, 29 జూలై (హి.స.)

:పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని యడవల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రదీప్ నకిలీ పోలీసు అధికారి అవతారమెత్తాడు. తాను సైబర్ వింగ్లో డీఎస్పీ స్థాయి అధికారి నని చెప్పి అందరికీ నమ్మబలికాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయిన బాధితులను లక్ష్యంగా చేసుకున్నాడు. పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పి స్తానని చెప్పి వారివద్ద భారీగా డబ్బులు వసూలు చేశా డు. పోలీసు శాఖలోని కొందరు అధికారులను సైతం తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సైబర్ నేరాలపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఆసమయంలో విద్యార్థులను పరిచయం చేసుకొని కల్లబొల్లి మాటలు చెప్పాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ప్రదీప్ నిజస్వరూపం బయటపడింది. ఈయనపై ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాలూకా పోలీసు స్టేషన్లోనే ఆయన విషయమై పంచాయితీ చేసినట్లు కూడా తేలింది. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలోనూ ప్రదీప్ చేసిన మోసాలపై విచారణ జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande