నందిగామ లో రాజకీయ ఘర్షణ
నందిగామ లో రాజకీయ ఘర్షణ
144


నందిగామ, 29 జూలై (హి.స.)

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని తుర్లపాడు గ్రామంలో తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YCP) పార్టీల వర్గాల మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. పాత కక్షలు, రాజకీయ విభేదాల నేపథ్యంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భారీగా బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతిభద్రతలను కాపాడేందుకు గాను గ్రామంలో తక్షణమే 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రజలు గుంపులుగా చేరవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande