
కోయగూడెం, 29 జూలై (హి.స.)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇల్లందు సింగరేణి ఏరియాలోని కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మైనింగ్ ప్రాంతంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో పాటు, రవాణా మార్గాలు బురదమయంగా మారాయి. దీనివల్ల గనిలో పనులు పూర్తిగా నిలిచిపోయి, సుమారు 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. నీటిని తోడేసి, పరిస్థితులను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి సింగరేణి సిబ్బంది చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, కైరిగూడ ఓసీపీ గనులతో పాటు సింగరేణి వ్యాప్తంగా పలు ఓపెన్కాస్ట్ మైనింగ్ ప్రాంతాలలో ఈరోజు (29 జూలై 2026) బొగ్గు ఉత్పత్తి, రవాణా పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi