
కామారెడ్డి, 29 జూలై (హి.స.)
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్ల (ఈఎఫ్ఎస్) ప్రక్రియను వంద శాతం పూర్తి చేసినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బందిని బుధవారం అభినందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,28,503 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,06,220 మంది (90.25 శాతం) ఓటర్లకు సంబంధించిన ఈఎఫ్ఎస్ డిజిటైజేషన్ పూర్తయింది. మిగిలిన 22,283 మంది (9.75 శాతం) ఓటర్లకు సంబంధించిన ఫారమ్లు అందుబాటులో లేకపోవడంతో వాటిని అన్కలెక్టెడ్ ఫార్మ్స్గా నమోదు చేసి, మొత్తం ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, బీఎల్వోలు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలో నాణ్యత, పారదర్శకతను కొనసాగిస్తూ భవిష్యత్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..