'రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలి'.. నల్గొండ జిల్లా కలెక్టర్
'రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలి'.. నల్గొండ జిల్లా కలెక్టర్
Collector


నల్గొండ, 29 జూలై (హి.స.)

జిల్లా ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్, చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా భూగర్భజలాలు పెరిగే అవకాశం లేదని, ఆరడబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు తాగునీటిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని, సక్రమ నీటి సరఫరాతో పాటు, ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా చూడాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటల పై అవగాహన కల్పించాలని, కందులు, కూరగాయలు, కీర దోస వంటి పంటలు సాగు చేసుకునేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఎట్టి పరిస్థితిలో భూములు పడావుగా ఉంచవద్దని, ఆరుతడి పంటలు వేసుకునేందుకు ఎంత విత్తనం కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు యూరియా తక్కువగా వాడేలా చూడాలని ఏఓను ఆదేశించారు.

వీబీ జి రామ్ జీ కింద గ్రామాల వారిగా అవసరమైన అన్ని పనులను చేపట్టాలని, జలసిరి కింద నీటి సంరక్షణ నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్ పిట్స్ చేపట్టాలన్నారు. వీబీ జీ రామ్ జీ కింద అన్ని గ్రామ పంచాయతీలలో పనులు ఉండేలా చూడాలని చెప్పారు. ఊట కుంటలు, చెరువులలో పూడికతీత, గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నిర్మాణం, అంగన్వాడీ నిర్మాణం, సోక్ పిట్లు, సోలార్ లైట్ల వంటి పనులకు అంచనాలు రూపొందించి మంజూరు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో భాగంగా మండలంలో వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను పునరుద్ధరించాలని, అంగన్వాడీ పనులు, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande