
నారాయణపేట, 29 జూలై (హి.స.) నారాయణపేట జిల్లాలోని ఊటుకూరు మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో ఇంటింటి తనిఖీలు, వాహనాల పత్రాల పరిశీలన చేపట్టారు. సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 ట్రాక్టర్ కలిపి మొత్తం 42 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..