గుంతకల్ మీదుగా అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలు
గుంతకల్ మీదుగా అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలు
tirupati


గుంతకల్లు, 29 జూలై (హి.స.)

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు మీదుగా అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైలు (నం. 07427) ఆగస్టు 23వ తేదీన ఉదయం మూడున్నర గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు నాగర్సోల్కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07428) ఆగస్టు 26న మధ్యాహ్నం రెండున్నర గంటలకు నాగర్సోల్లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6-45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, బాసర, ముడ్ఖేడ్, నాందేడ్, పూర్ణా, పర్బని, జల్నా, ఛత్రపతి శంభాజీ నగర్ స్టేషన్ల మీదుగా వెళ్తుందని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande