తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం
తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం
INDIA TIGER CONSERVATION


తూర్పుగోదావరి, 29 జూలై (హి.స.)

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పెద్దపులి సంచరిస్తోంది. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుండి వలస వచ్చిన ఈ మగ పులి కరగపాడు, బుచ్చియ్యపాలెం, నందిగూడెం, గుడ్డిగూడెం పరిసరాల్లోని ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో తిరుగుతోంది.

ఇది ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పశువులపై దాడి చేసింది. పులి మెడకు ఉన్న కాలర్ సిగ్నల్స్ ఆధారంగా అటవీ అధికారులు దాని కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు మరియు బోన్ల సహాయంతో పులిని పట్టుకోవడానికి రెస్క్యూ టీమ్లు ప్రయత్నిస్తున్నాయి.

ప్రజలు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు పంపవద్దని మరియు రాత్రి వేళల్లో గుంపులుగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande