బంగాళాఖాతంలో మునిగిన వాళ్లే హైడ్రాను ముంచుతామంటారా?’.. కేటీఆర్పై తుమ్మల సెటైర్
హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Thummala


హైదరాబాద్, 29 జూలై (హి.స.)హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే అర్థం లేదంటూ సెటైర్ విసిరారు. వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30 శాతం లోటు వర్ష పాతం నమోదైందని తెలిపారు. 150 ఏళ్ల నుంచి చూడని ప్రకృతి వైపరీత్యం వచ్చిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా తీవ్ర ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాన్ని గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు.

రైతులు మెట్ట పంటలు వేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ వైపు ఎక్కువగా రైతులు మొగ్గుచూపుతున్నారని, ఇది మంచి శుభపరిణామమని అన్నారు. గాంధీ భవన్ను దేవాలయంగా భావించి నమ్మకంతో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. ఏ పార్టీ నిర్వహించని ముఖాముఖిని కాంగ్రెస్ నిర్వహిస్తోందన్నారు. కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తూ రిపోర్ట్ అడుగుతున్నామన్నారు. ముఖాముఖి నిర్వహిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande