తీరం దాటిన తీవ్ర వాయుగుండం.....రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత
వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది.
rain


కర్నూలు, 29 జూలై (హి.స.) :వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది.

వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది. తర్వాత పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇంకా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉత్తరాంధ్రలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. తిరుపతిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. కాగా, బుధవారం రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande