వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు.. ఆలయాల్లో భక్తుల రద్దీ
వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు.. ఆలయాల్లో భక్తుల రద్దీ
guru-purnima-celebrations-held-on-a-grand-scale


కర్నూలు, 29 జూలై (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ఆలయాలకు ఉదయం నుండే భక్తుల రద్దీ పెరిగిపోయింది. ముఖ్యంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. సాయి నామస్మరణతో ఆలయాలు మార్మోమోగుతున్నాయి. భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయాల అధికారులు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. ఆలయాలను పూలతో అలంకరించి ఉదయం నుండే పూజలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే సనాతన సంప్రదాయం ప్రకారం తల్లి, తండ్రి తరవాత స్థానాన్ని గురువుకు ఇచ్చారు. గురువును పూజించేందుకే గురుపౌర్ణిమను జరుపుకుంటారు. వ్యాసుడి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు కాబట్టి వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. గురువులను పూజించే పండుగ కాబట్టి నేడు ఆలయాలలోనే కాకుండా విద్యాసంస్థల్లోనూ వేడుకలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు తమ గురువును పూజించి, సన్మానం చేస్తారు. గురువులు విద్యార్థులను ఆశీర్వదిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande