'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలపై కేంద్ర కార్యదర్శులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
వికసిత్ భారత్ 2047' లక్ష్యాలపై కేంద్ర కార్యదర్శులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
modi


న్యూఢిల్లీ, 29 జూలై (హి.స.)

న్యూఢిల్లీలోని 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు చెందిన శాఖల భవిష్యత్తు కార్యాచరణ, 'వికసిత్ భారత్' లక్ష్యాల సాధనపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు.

పాలనలో వివిధ విభాగాల మధ్య వ్యత్యాసాలను తొలగించి, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే ధ్యేయంతో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, కీలక రంగాల్లో సాంకేతిక స్వయంసమృద్ధి సాధించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

ఇంధన భద్రత అనేది జాతీయ భద్రత మరియు ఆర్థిక స్థిరత్వంతో ముడిపడి ఉందని, ఇంధన రంగంలో వినూత్న మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే డిజిటల్ వ్యవస్థలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై నిరంతర నిఘా ఉంచాలని, యువ ఆవిష్కర్తలను సైబర్ సెక్యూరిటీ రంగంలోకి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని, ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా ఉంచుకుని పాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ప్రధాని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande