
జార్ఖండ్, 29 జూలై (హి.స.)
మావోయిస్ట్ అత్యున్నత కేంద్ర కమిటీ, పాలిట్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్రనేత మిసిర్ బెస్రా (Misir Besra)ను మంగళవారం రాత్రి భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఝార్ఖండ్లోని ధనాబాద్-గిరిడీ జిల్లాల సరిహద్దులోని తుండి-మండియా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, ఝార్ఖండ్ పోలీసులు (Jharkhand Police) సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్లో బెస్రా పోలీసులకు చిక్కినట్లు ప్రకటించారు. ఆయనతో పాటు అనుచరులు గౌరవ్ హాస్దా, మోచూలను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీఎఫ్ (CRPF) మోహరింపు తీవ్రతరం కావడం, అలాగే అంతకుముందు రోజే తన ప్రధాన అనుచరులు 16 మంది పోలీసులు ఎదుట లొంగిపోవడంతో అడవి నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తుండగా ఆయనను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం రూ. కోటికి పైగా ఇనాం (రివార్డు) ప్రకటించి ఉంది.
మిసిర్ బెస్రా (Misir Besra arrested) అరెస్టుతో మావోయిస్ట్ కేంద్ర కమిటీకి చెందిన క్రియాశీల నాయకులు ఎవరు బయట లేనట్లయింది. ఒకప్పుడు 40 మందికి పైగా సభ్యులు ఉన్న కేంద్ర కమిటీలోని నేతలను భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగిబాటల ద్వారా మట్టుబెట్టగా, రెండ దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెస్రా కూడా ఇప్పుడు పట్టుబడ్డారు. వెస్ట్ సింగ్సూమ్ జిల్లాలోని సారండా అడవుల్లో బెస్రా ప్రభావం వల్లే కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాను 'నక్సల్ ప్రభావిత ప్రాంతం'గా కొనసాగించింది. ఇప్పుడు ఆయన అరెస్ట్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెస్ట్ సింగ్ భూమ్ హోదాపై పునఃసమీక్ష జరిపే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు