రాహుల్ వర్సెస్ కేంద్రం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి సీరియస్
రాహుల్ వర్సెస్ కేంద్రం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి సీరియస్
రాహుల్ గాంధీ


న్యూఢిల్లీ, 29 జూలై (హి.స.)

విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని, ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదు, భావ వ్యక్తీకరణ అని బుధవారం లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో పేపర్ లీక్పై ఏం జరిగిందో బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలన్నారు. యువత సెంటిమెంట్ ను అన్ని పార్టీలు గౌరవించాలని తీవ్ర వేదన తర్వాతే ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన చేశారన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, విద్యార్థుల ఆందోళనను బీజేపీ నేతల పిల్లలు సమర్థించారు కానీ విద్యార్థుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకోలేదని విమర్శఇంచారు. కేంద్రం మూర్ఖంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. విద్యారంగం ఇప్పుడు ఖరీదైన వ్యాపారంగా మారిందని దీంతో పేదలు విద్యకు దూరమవుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడియట్స్ అంటూ రాహుల్ మాట్లాడుతున్నారని అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande