
బెంగళూరు, 29 జూలై (హి.స.)మునగ అద్భుతమైన పోషకాలు కలిగిన చెట్టు. ఈ ఆకుల్లో విటమిన్ A,C,Eలతో పాటు కాల్షియం, పొటాషియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని ‘సూపర్ ఫుడ్’ అని అంటారు.
మనకి తెలిసిన ఆకులన్నీ ఒక ఎత్తు ఈ మునగాకు ఒక ఎత్తు. ఇది మాములు ఆకు కాదు.. ఆకు పచ్చ బంగారమే అని చెప్పాలి. ఒక స్పూన్ పొడితో 300 రోగాలు నివారిస్తారు. ఆరోగ్యానికి ప్రకృతి వరం ఇదే. ఇది పల్లెల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మరి అస్సలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.
అది మరేదో ఆకు కాదండి మునగాకు. ఈ ఆకుల్లో విటమిన్ A, C, E పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఐరన్ అధికంగా ఉండటంతో రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. కాబట్టి, మీరు దీనిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఆకులు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి
ఈ ఆకుల్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అదే విధంగా ఫైబర్ జీర్ణక్రియకు పనిక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. ప్రోటీన్ కూడా ఉండటంతో కండరాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఈ ఆకులు శరీరంలో ఇమ్మ్యూనిటీ పవర్ ను పోషకాలు దీనిలో ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇంకా దీనిలో కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటా కెరోటిన్ దీనిలో ఉంటుంది. మీరు ఈ ఆకుతో పప్పు, కూర, టీ ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల వంటకాలు చేసుకుని మీ ఆహారంలో ఎంచక్కా తినొచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV