
Andhra Pradesh, 29 జూలై (హి.స.) శ్రీశైలం ఫాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 39 అంశాలకు ఆమోదం తెలిపారు. ప్రధనాంగా శ్రీశైలం ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాల్లో సంస్కరణలు చేపట్టారు. వచ్చే నెల 15 నుంచి తిరుమల తరహాలో శ్రీశైలంలోనూ ఆన్లైన్ ప్రొటోకాల్ టికెట్లు జారీ చేయనున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందు లేకుండా ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తామంటున్నారు. అలాగే శ్రీశైలం ఆలయానికి సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ రమేష్నాయుడు తెలిపారు. టీటీడీ తరహాలో సిఫార్సు లేఖలపై శ్రీశైలంలో కూడా ప్రొటోకాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారానే జారీచేసే విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆగస్టు 15 నుంచి కొత్త విధానాన్ని అమల చేస్తామని.. సామాన్య భక్తుల ఇబ్బంది లేకుండా ఈ ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయన్నారు. సిఫార్సు లేఖలు కనీ 48 గంటల ముందు పంపాలన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్, ఏ-గ్రేడ్ శౌచాలయాలు, స్నానపు గదుల నిర్మాణం, పీఏసీ (పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్) అవసరం ఉందని నిర్ణయించారు. పాలకమండలిసమావేశంలో మొత్తం 45 అంశాలపై చర్చించి.. 39 అంశాలను ఆమోదించారు. శ్రీశైంలో శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణ మాసోత్సవాలు, సహస్రఘటాభిషేకంపై చర్చ జరిగింది.
అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు. శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్నాయుడు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV