
తిరుమల 29 జూలై (హి.స.)తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం తిరుపతిలో భక్తులకు ప్రతినిత్యం అందజేసే ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని బుధవారం పూర్తిగా రద్దు చేశారు.
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద భక్తులకు ప్రతినిత్యం అందజేసే ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని బుధవారం పూర్తిగా రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ, నిర్వహణా కారణాల దృష్ట్యా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, శుక్రవారం నాటి శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను మాత్రం గురువారం మధ్యాహ్నం నుంచి సదరు కౌంటర్ల వద్ద యథావిధిగా జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాబట్టి గురువారం మధ్యాహ్నం వరకు ఉచిత దర్శన టోకెన్లు లభించవని, శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను రూపకల్పన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నేడు గురు పూర్ణిమ సందర్భంగా భక్తుల రద్దీ బాగా పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV