
చంద్రగిరి, 30 జూలై (హి.స.)
: తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జగదీశ్(47), ధనలక్ష్మి దంపతులు. వారిద్దరూ తిరుపతిలో నివాసం ఉంటూ రంగంపేటలోని ఓ కళాశాలలో పని చేస్తున్నారు. బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. అక్కడి నుంచి జగదీశ్ చంద్రగిరిలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. అక్కడ తాను చనిపోతున్నట్లు భార్యకు వీడియో కాల్ చేసి చెప్పారు. కంగారు పడిన ధనలక్ష్మి పొరుగువారికి కాల్ చేశారు. స్థానికులు తలుపులు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ తెరుచుకోకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూసేసరికి జగదీశ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ