
జంగారెడ్డిగూడెం : 02 ఆగస్టు (హి.స.)
జంగారెడ్డిగూడెం పట్టణం రాముడు కుంట చెరువు కాలనీలో రూ. 32 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న సామాజిక భవనానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక సీఎస్టీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.5 లక్షలతో నిర్మించిన సైకిల్ షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు, పురపాలక కమిషనర్ కె.వి రమణ, తహసీల్దార్ స్లీవ జోజి, తెదేపా పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు దాసరి శేషు, పరువు సత్యనారాయణ, షేక్ ముస్తఫా, బొబ్బర రాజ్ పాల్, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ