
త్రిపురాంతకం:, 02 ఆగస్టు (హి.స.)
అదుపుతప్పి ఆటో బోల్తా పడటంతో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం త్రిపురాంతకం మండలంలోని రామసముద్రం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే యర్రగొండపాలెం మండలంలోని నర్సాయపాలెంకు చెందిన వ్యవసాయ కూలీలు ప్రకాశం జిల్లా కురిచేడు ప్రాంతంలో పని చేసేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో రామసముద్రం దాటిన వెంటనే రహదారిపై ఒక్కసారిగా కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు మరో ఏడుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్లో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ