
కిర్లంపూడి: 02 ఆగస్టు (హి.స.)
మండలంలోని కృష్ణవరం గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ పేజ్- 3 వద్ద ఏలూరు ప్రధాన కాల్వను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఆఫ్ టెక్ ద్వారా గోదావరి నీటిని ఏలేరు కాల్వకు విడుదల చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గోదావరి జల్లాలకు ప్రత్యేక పూజలు చేసి, ఏలేరుకు నీటి విడుదల చేశారు. దీని ద్వారా 53 వేల ఎకరాల సాగుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల బాబు, తుమ్మలపల్లి రమేష్, ఏలూరు ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ