సికింద్రాబాద్లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు.
Bonalu


హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.) నగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాల సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూ లైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

సోమవారం అమ్మవారి భవిష్యవాణి ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది. లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. దేవాలయంలో అమ్మవారి దర్శనానికి శివ సత్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande