ఏపీ డెయిరీ డెవలప్మెంట్ అనుబంధ సంస్థ బాధ్యతలు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి కి అప్పగింత

అమరావతి, 30 జూలై (హి.స.)

ఏపీ డెయిరీ డెవలప్మెంట్, అనుబంధ సంస్థ(APDASCAC) బాధ్యతలను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డికి అదనపు బాధ్యతలుగా అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓఆర్టీ.నం128ను జారీ చేసింది. ఏపీడీఏఎస్సీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయ బాధ్యతలను కూడా ఎం. వేణుగోపాల్ రెడ్డి నిర్వహించనున్నారు. కార్పొరేషన్కు సంబంధించిన పరిపాలనా, అధికారిక వ్యవహారాలతో పాటు అన్ని ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యతలనూ వేణుగోపాల్ రెడ్డి చేపట్టనున్నారు.

తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్పొరేషన్కు చెందిన అధికారులు, సిబ్బంది అంతా ఎం.వేణుగోపాల్ రెడ్డితో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా తన బాధ్యతలతో పాటు ఈ అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇటీవల పదవీ విరమణ చేసిన అధికారి బి.రవి ప్రకాష్ రెడ్డి స్థానంలో తాత్కాలికంగా ఈ బాధ్యతలను ఎం.వేణుగోపాల్ రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande