
హైదరాబాద్, 30 జూలై (హి.స.)
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్లోలో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2022 ఏప్రిల్ 1న కోవిడ్ నియంత్రణ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ నిర్వహించారనే ఆరోపణల పై ఆయనపై కేసు నమోదైంది. అప్పట్లో కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన ఈ కేసు విచారణలో భాగంగా డిప్యూటీ సీఎం కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు