
అమరావతి, 30 జూలై (హి.స.)
మాకవరపాలెం మండలాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు కంపెనీలు రాగా.. తాజాగా జపాన్కు చెందిన ఓ స్టీల్ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే జపాన్ బృందం, అధికారులతో కలిసి భూములను పరిశీలించింది. రూ. 50వేల కోట్లు పెట్టేందుకు జపాన్ కంపెనీ ఆసక్తిగా ఉంది. దీనికి సుమారు 1000 ఎకరాలు అవసరమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో.. మండలంలో ఇప్పటికే 4250 ఎకరాలను ల్యాండ్ బ్యాంక్గా గుర్తించిన భూమిని చూపించారు. ఇందులో ఆడిగర్లపాలెం, మామిడిపాలెం గ్రామాలను ఆనుకుని ఉన్న రిజర్వాయర్ను, జాజిగెడ్డను పరిశీలించారు. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్తు, రహదారి అనుసంధానం చేసేందుకు తూటిపాల రెవెన్యూలోని అడిగర్లపాలెంలోని ల్యాండ్ బ్యాంక్ భూములపై సమీక్షించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ