
అమరావతి, 30 జూలై (హి.స.)
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదేశాల మేరకు గురువారం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ తమ్మినేని గీతాసాగర్ , స్టేట్ లీగల్ కార్యదర్శి, 13వ వార్డు ఇన్ఛార్జ్ తమ్మినేని విద్యాసాగర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా మెట్టక్కివలసలోనూ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవితోపాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ