ముందుగా లాగౌట్ అవ్వండి.. ఐటీ ఉద్యోగులకు పోలీసుల సూచనలు
హైదరాబాద్, 30 జూలై (హి.స.) రాజధాని నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రహదారులపై తీవ్ర ట్రాఫిక్ స్తంభించకుండా, ఐటీ ఉద్యోగులు సురక్షితంగా ఇళ్లకు చేరు
Police


హైదరాబాద్, 30 జూలై (హి.స.)

రాజధాని నగరంలో భారీ వర్షాలు కురిసే

అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రహదారులపై తీవ్ర ట్రాఫిక్ స్తంభించకుండా, ఐటీ ఉద్యోగులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ కీలక సూచనలు చేసింది. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు వీలైనంత వరకు తమ్మ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యాన్ని కల్పించాలని పోలీసులు కోరారు. ఆఫీసుల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచే విడతల వారీగా (Staggered Logouts) ముందస్తు లాగౌటు అనుమతి ఇవ్వాలని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.

ఒకే సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడం వల్ల ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో) తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడి వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీన్ని అరికట్టేందుకే విడతల వారీగా లాగౌట్ ఇవ్వాలని పోలీసులు సూచించారు. కంపెనీలు ఈ సూచనలను పాటించి ట్రాఫిక్ నిర్వహణకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande