సర్’కు.. ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదు
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి.
Sudarshan reddy


హైదరాబాద్, 30 జూలై (హి.స.)రాష్ట్రంలో అమలు చేస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సర్ పత్రాల డిజిటలైజేషన్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘సర్ ప్రక్రియ తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు మాత్రమే. ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదు. సర్వేకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆగస్టు 3లోపు 100 శాతం ఫారాల డిజిటలైజేషన్ చేయాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో 76 శాతం పత్రాల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగింది. ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హుజూర్నగర్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, బోథ్ నియోజకవర్గాల్లో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి’ అని సీఈవో దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande