శ్రీశైలం దేవస్థానంలో ఆన్లైన్ టికెట్ల.బుకింగ్.లో.ఇబ్బందులు దేవాదాయ శాఖ కీలక నిర్ణయం
శ్రీశైలం దేవస్థానంలో ఆన్లైన్ టికెట్ల.బుకింగ్.లో.ఇబ్బందులు దేవాదాయ శాఖ కీలక నిర్ణయం
srishailam


నంద్యాల 30 జూలై (హి.స.)

, :శ్రీశైలం దేవస్థానంలో ఆన్లైన్ టికెట్ల బుకింగ్లో ఇబ్బందులు, ఆన్లైన్ వెబ్సైట్తో పాటు మనమిత్ర యాప్లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన 9&9 సంస్థపై దేవాదాయ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. 9&9 సంస్థ.. 2021 నుంచి దేవస్థానం కోసం వెబ్సైట్ను రూపొందించి, ఆన్లైన్ టికెట్ల జారీ ప్రక్రియను నిర్వహిస్తోంది.

టికెట్ బుకింగ్లో అంతరాయం నేపథ్యంలో 9&9 సంస్థ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు.. టీఎంఎస్(TMS) సంస్థ ద్వారా టికెట్లను జారీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సంస్థ ద్వారా త్వరలోనే టికెట్ల బుకింగ్ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే గతంలో టీఎంఎస్ సంస్థ ద్వారా టికెట్ల జారీ నిర్వహించిన సమయంలో అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో మళ్లీ అదే సంస్థకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై దేవాదాయ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande