తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రంపేర్కొంది.
Rain alert


హైదరాబాద్, 30 జూలై (హి.స.)తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్తోపాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్తోపాటు హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande