
హైదరాబాద్, 30 జూలై (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్
కార్డుల లబ్ధిదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థను రేషన్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు చేపడుతుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా ఉండడంతోపాటు అర్హులైన రేషన్ లబ్దిదారులకు రేషన్ బియ్యం ఇచ్చేందుకు ఈ- కేవైసీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ- కేవైసీ ప్రక్రియను ఈ నెల చివరి వరకు 31వ తేదీ వరకు పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం తీసుకుంటున్న రేషన్ కార్డుల లబ్ధిదారులందరూ రేషన్ షాపుల్లో ఈ- కేవైసీ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ-కేవైసీ చేయించని రేషన్ లబ్ధిదారులకు వచ్చేనెల(ఆగస్టు) నుంచి రేషన్ బియ్యం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
రేషన్ లబ్ధిదారుల కుటుంబంలోని అందరి సభ్యుల ఆధార్ కార్డులను అప్డేట్ అనుసంధానం (ఎన్రోల్మెంట్) చేసి ఈ కేవైసీ నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రక్రియ వల్ల నకిలీ కార్డులతో పాటు, చనిపోయిన వ్యక్తుల పేర్లు కూడా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ- కేవైసీ ప్రక్రియను చేపడుతుంది. దీనికోసం రేషన్ లబ్ధిదారులందరూ వారి వారి రేషన్ దుకాణాల్లో రేషన్ కార్డులలోని లబ్ధిదారుల అందరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించి రేషన్ దుకాణాల్లో ఈ- కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల(జులై) 31వ తేదీలోగా రేషన్ దుకాణాల్లో ఈ కేవైసీ పూర్తి చేయించుకుని ప్రభుత్వమందించే రేషన్ బియ్యాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ అందుకునే ప్రతి కుటుంబం ఈ కేవైసీ చేయించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు