
కొత్తూరు, 31 జూలై (హి.స.)
: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని కేజీబీవీ టైపు ఫోర్ వసతిగృహంలో ఓ విద్యార్థిని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె స్వగ్రామం సీతంపేట మండలం లక్కయ్యగూడ గ్రామం. కొత్తూరు ఎస్సై కె.వెంకటేశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ