
అమరావతి, 31 జూలై (హి.స.)
Lఇంటింటికీ కూటమి కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాలుగో రోజు రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల ఇళ్లకు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాయి. ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న క్యాడర్కు పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ స్వయంగా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. మరికొందరికి స్వయంగా అభినందనల ఎస్ఎంఎస్లు పంపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ