ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ వీసీ పాఫెసర్ పీ వీజీడీ ప్రసాద రెడ్డి.సస్పెండ్
ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ వీసీ పాఫెసర్ పీ వీజీడీ ప్రసాద రెడ్డి.సస్పెండ్
ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ వీసీ పాఫెసర్ పీ వీజీడీ ప్రసాద రెడ్డి.సస్పెండ్


అమరావతి, 31 జూలై (హి.స.)

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ( మాజీ వీసీ, ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్, విచారణ కమిటీల నివేదికల ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఇవాళే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ప్రసాదరెడ్డి అక్రమాలపై తాజాగా నివేదిక రావడంతో చర్యలు తీసుకున్నారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి పనిచేశారు. ఆ సమయంలో అనేక అరాచకాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు ఆయన అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసు చేసింది. ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది.

ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో దాదాపు వైకాపా కార్యకర్తలా పనిచేశారు. యూనివర్సిటీని వైకాపా కార్యాలయంలా, రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారన్న విమర్శలు వచ్చాయి. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే వైకాపా కార్పొరేటర్ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు ప్రచార వ్యూహాలన్నీ వీసీ కార్యాలయం కేంద్రంగానే నడిచాయని, విద్యార్థులతో సర్వేలు చేయించారని ఆరోపణలు వచ్చాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande