లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. సీపీ సజ్జనార్
లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. సీపీ సజ్జనార్
Cp


హైదరాబాద్, 31 జూలై (హి.స.)

రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే

ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శుక్రవారం శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని అన్నారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, అదే తరహాలో లాల్దర్వాజా బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న ఆయన, 2 వేల మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్అండ్ బీ తదితర శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఈవ్తోజింగ్, చైన్స్నాచింగ్లు, జేబుదొంగతనాలు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ఆధ్వర్యంలో 24 గంటల ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (సౌత్ రేంజ్) తఫ్టిర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande