
సిద్దిపేట, 31 జూలై (హి.స.)
గజ్వేల్ ఏసీపీ కె.నర్సింలు శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా తొగుట పోలీస్ స్టేషనను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణతో పాటు వివిధ విభాగాలను పరిశీలించి, రికార్డులు, కేసు ప్రాపర్టీ, స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న కేసు సంబంధిత వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్లోని సైబర్ క్రైమ్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, సీసీటీఎన్ఎస్ తదితర విభాగాల పనితీరును సమీక్షించి, సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఆర్థిక నేరాలు, దొంగతనాలు తదితర కేసుల దర్యాప్తును నిష్పాక్షికంగా, వేగవంతంగా పూర్తి చేయాలని తొగుట ఎస్ఐ నవీన్ తో పాటు పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్షిక తనిఖీలో తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ లతీఫ్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..