జాబితా డిజిటలైజేషన్లో రాష్ట్రంలో జనగామకు తొలి స్థానం.. కలెక్టర్
జాబితా డిజిటలైజేషన్లో రాష్ట్రంలో జనగామకు తొలి స్థానం.. కలెక్టర్
Collector


జనగామ, 31 జూలై (హి.స.)

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)

ప్రక్రియలో ఓటరు జాబితా డిజిటలైజేషన్ ను 99.79 శాతం పూర్తి చేసి జనగామ జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఓటరికి రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో కాకుండా ఒకే కేంద్రంలో ఉండేలా ఫ్యామిలీ కార్డు ఆధారంగా వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేపడుతున్నామని వెల్లడించారు. నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను గుర్తించి వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా ఓటరు జాబితాలో సవరణలు చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న 13 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటి హేతుబద్ధీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్తో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande