నిండు కుండలా తెలుగు రాష్ట్రాల జలాశయాలు.. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం
నిండు కుండలా తెలుగు రాష్ట్రాల జలాశయాలు.. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం
Kaleshwaram


కాలేశ్వరం, 31 జూలై (హి.స.)

తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ

ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధాన జలాశయాలకు భారీగా వరద చేరుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, కడెం, మేడిగడ్డ బ్యారేజీల నుంచి భారీగా నీటిని వదులుతుండగా, భద్రాచలం, కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం

ఎగువన భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహితకు భారీ వరద వచ్చింది. త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 11 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 12.210 మీటర్లకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ వరద కొనసాగుతుండగా, ఇన్ఫ్రా, ఔట్లో 6,79,910 క్యూసెక్కులుగా నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,32,785 క్యూసెక్కుల ఇన్లో నమోదవగా, 15 గేట్లు ఎత్తి 1,16,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు 35,473 క్యూసెక్కుల వరద చేరడంతో 5 గేట్ల ద్వారా 46,747 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ములుగు జిల్లా పేరూరు, రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41 అడుగులకు చేరగా, 8.12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande