లక్ష్యాలను నెరవేర్చకపోతే కఠిన చర్యలు తప్పవు.. ఆయిల్ పామ్ కంపెనీలకు తుమ్మల ఆదేశాలు.
ఆయిల్ పామ్ కంపెనీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై కీలకంగా చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల లక్ష్యాలు, మిల్లుల నిర్మాణ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించా
Nageshwar rao


హైదరాబాద్, 31 జూలై (హి.స.)ఆయిల్ పామ్ కంపెనీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై కీలకంగా చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల లక్ష్యాలు, మిల్లుల నిర్మాణ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కంపెనీల లక్ష్యాల సాధనపై మంత్రి ఆరా తీశారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనులపై సమీక్షించారు.

మిల్లుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ లక్ష్యాలను ఆయిల్ పామ్ కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. లక్ష్యాలు నెరవేర్చని కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande