
విజయనగరం, 31 జూలై (హి.స.)
ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 - 10:50 గంటల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతారు. అనంతరం 10:50- 10:55 గంటల సమయంలో కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10:55 -10:58 గంటల మధ్య 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం చెబుతారు. 11:00 - 11:15 గంటల సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 11:17 - 11:25 గంటల మధ్య టెర్మినల్ భవనం నుంచి ఓపెన్టాప్ జీప్లో ప్రధాని మోదీ బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. అనంతరం 11:30 - 12:55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 1:05 - 1:10 మధ్య భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమవుతారు. మొత్తం సుమారు 2.25 గంటలపాటు మోదీ పర్యటన కొనసాగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ