వర్షం ఇబ్బందులా.. 1070కు కాల్ చేయండి.
వర్షాల నేపథ్యంలో ట్రై కార్పొరేషన్లు, హైడ్రా అప్రమత్తమయ్యాయి.
Call centre


హైదరాబాద్, 31 జూలై (హి.స.)వర్షాల నేపథ్యంలో ట్రై కార్పొరేషన్లు, హైడ్రా అప్రమత్తమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్న అధికారులు.. వరద నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్లపై వరద నీరు నిలిచినా, చెట్టు కూలినా, కింద పేర్కొన్న నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయా సంస్థలు సూచిస్తున్నాయి. మై క్యూర్ యాప్లోనూ ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

కంట్రోల్ రూమ్ - 1070

కంట్రోల్ రూమ్ నెంబర్లు

90001 13667

87124 06901

73372 18171

040 2111 1111

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande