రేషన్ కార్డుల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
Ration


హైదరాబాద్, 31 జూలై (హి.స.)రేషన్కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఈ-కేవైసీ చేయడానికి ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. ఈ-కేవైసీ చేయకుంటే రేషన్ పొందలేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేవైసీ చేయనప్పటికీ ఆగస్టు 31 వరకు రేషన్ పొందవచ్చునని స్పష్టం చేశారు. దీంతో రేషన్ లబ్ధిదారులకు ఊరట లభించినట్లయ్యింది.

మూడు నెలల రేషన్ ఒకేసారి..

మరోవైపు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయించిందని, బియ్యం ఉచితంగా, గోధుమలను కిలోకు రూ.7 చొప్పున పంపిణీ చేస్తున్నదని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు సరుకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు వరకు పొడిగించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande