
హైదరాబాద్, 31 జూలై (హి.స.)
సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రికి మాజీ
మఖ్యమంత్రి, దివంగత మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఆస్పత్రి పేరుTIMS (Telangana Institute of Medical Sciences) అని ఉండగా పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్పత్రిని పేద ప్రజలకు సూపర్ స్టెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మించింది. మే1, 2026 నుండి నెల రోజుల పాటు ఓపీ సేవలు, ప్రాథమిక రోగనిర్ధారణ పరీక్షలను సైతం ప్రయోగత్మకంగా నిర్వహించారు. జూన్ 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల పూర్తిస్థాయి సేవల ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఈ ఆస్పత్రిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 240 పోస్టులకు గానూ కాంట్రాక్ట్ పద్దతిలో నియామకాలు చేపడుతున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ సహా ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. త్వరలోనే ఆస్పత్రి ప్రారంభోత్సవం కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు