కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రిన్సిపల్ సెక్రెటరీ
కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రిన్సిపల్ సెక్రెటరీ
Collector


వికారాబాద్, 31 జూలై (హి.స.)

కొడంగల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్. శ్రీనివాస రాజు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణ పురోగతి, పనుల నాణ్యత, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలి.. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్. శ్రీనివాస రాజు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, అత్యున్నత ప్రమాణాలతో నాణ్యతను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, రవాణా, క్యూలైన్లు, పార్కింగ్, ఇతర మౌలిక సౌకర్యాలను ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అధికారులు పర్యవేక్షించాలి.. నిరంతరం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, ఆలయ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసి, భక్తుల దర్శనాలకు ఆలయాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఆలయ అభివృద్ధి పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ గడువులు నిర్ధేశిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతి మందగించిందని, మౌలిక సౌకర్యాల కల్పనలో కూడా వేగం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. పరిశీలనలకే పరిమితం కాకుండా, కాంట్రాక్టర్లపై బాధ్యతాయుతంగా పర్యవేక్షణ కొనసాగించి పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande