మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు


కడప, , 31 జూలై (హి.స.) వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనందరెడ్డి(85) (YS Ananda Reddy Death) అనారోగ్యంతో మృతిచెందారు.

హైదరాబాద్ నివాసంలో ఆనందరెడ్డి గత కొంతకాలంగా ఉంటున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డి సోదరుడే ఆనందరెడ్డి. పులివెందులలో చికిత్స పొందుతూ ఆనందరెడ్డి మృతిచెందారు.

ఈరోజు (శుక్రవారం) సాయంత్రం పులివెందులలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆనందరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. ఆయన మృతిపై పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆనందరెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande